MS ధోని ఇంటి గేటు ఎదుట రవీంద్ర జడేజా.. పోస్ట్ వైరల్

by GSrikanth |
MS ధోని ఇంటి గేటు ఎదుట రవీంద్ర జడేజా.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో ఆటను సీరియస్‌గానే కాకుండా అప్పుడప్పుడు ఫన్నీగా తీసుకునే ప్లేయర్లలో రవీంద్ర జడేజా ఒకరు. ఫన్నీగా ఉండటం అంటే ఆటలో నిర్లక్ష్యంగా ఉండటం కాదు.. ప్రత్యర్థులపై కోపం పెంచుకోకుండా గెలుపోటములను సరదాగా తీసుకోవడం. ఈ జాబితాలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హర్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ కూడా ఉంటారు. అయితే, లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో జడేజా, డేవిడ్ వార్నర్ మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మ్యాచ్ అనంతరం కొన్ని రోజుల పాటు వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

కేవలం ఆటలోనే కాదు.. నిజ జీవింతోనూ జడ్డూ అంతే సరదాగా ఉంటారు. తాజాగా.. ఆయన చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ రాంచీలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం జడేజా రాంచీలోని ఎమ్ఎస్ ధోని ఇంటికి వెళ్లారు. లోనికి వెళ్లేముందు గేటు బయట ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలను తాజాగా.. జడేజా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘అభిమాన ఆటగాడి ఇంటి ముందు అభిమాని’ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు కూడా వైరల్‌గా మారింది.

Advertisement

Next Story