- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ranji Trophy : పుంజుకున్న విదర్భ.. బ్యాటర్లు చెలరేగడంతో ఆధిక్యంలోకి..
దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న సెమీస్‌లో విదర్భ సోమవారం పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపర్చిన బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగడంతో ఆ జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 13/1తో మూడో రోజు ఆట కొనసాగించిన విదర్భ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లను కోల్పోయి 343 పరుగులు చేసింది. యశ్ రాథోడ్(97 బ్యాటింగ్) క్రీజులో పాతుకపోయి జట్టుకు ఆధిక్యం సాధించిపెట్టాడు. అతనికితోడు అక్షర్(77), అమన్ మొఖడే(59) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆదిత్య(14 బ్యాటింగ్)తో కలిసి యశ్ మూడో రోజు ఆటను అజేయంగా ముగించాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ రెండేసి వికెట్లతో రాణించారు. ప్రస్తుతం విదర్భ 261 పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించింది. మ్యాచ్‌లో రెండు రోజులు మిగిలి ఉండగా నేడు మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 170 పరుగులకు ఆలౌటవ్వగా.. మధ్యప్రదేశ్ 252 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
- Tags
- #Ranji Troph