HYD: సరోజిని ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు

by Gantepaka Srikanth |
HYD: సరోజిని ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి(Diwali) పండుగ వేళ బాణసంచా కాలుస్తూ హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక మంది ప్రమాదానికి గురయ్యారు. ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని సరోజిని కంటి ఆసుపత్రి(Sarojini Hospital)కి బాధితులు క్యూ కట్టారు. ఆసుపత్రి(Hospital) సిబ్బంది వివరాల ప్రకారం.. ఇప్పటివరకు బాణసంచా కారణంగా కంటి సమస్యలు ఏర్పడిన బాధితులు దాదాపు 38 మంది ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చిన వారిలో అధికంగా వృద్ధులే ఉన్నట్లు సమాచారం. ప్రమాద బాధితులకు సరోజిని కంటి ఆసుపత్రి(Sarojini Hospital) డాక్టర్లు, సిబ్బంది అవసరమైన సహాయం అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా.. దీపావళి(Diwali) పండుగ వేళ ఏ లెవెల్‌లో బాణసంచా కాలుస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే స్వచ్ఛమైన గాలి దొరక్క ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు.. దీపావళి రోజున చేసే పొల్యూషన్‌తో ఒక వారం పాటు ఉక్కిరిబిక్కిరి అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Next Story

Most Viewed