CM Chandrababu: నేడు, రేపు ఉత్తరాంధ్రలో సీఎం చంద్రబాబు పర్యటన

by Rani Yarlagadda |   ( Updated:2024-11-01 02:21:58.0  )
CM Chandrababu: నేడు, రేపు ఉత్తరాంధ్రలో సీఎం చంద్రబాబు పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట మండలం ఈదుపురం గ్రామంలో మహిళలకు దీపం పథకాన్ని (Deepam Scheme) ప్రారంభించనున్నారు. గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసిన 48 గంటల్లోగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున.. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఫ్రీ గా అందించనుంది. ఇందుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి. ఈ పథకానికి రూ.2684 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఆయా పెట్రోలియం సంస్థలకు ఇటీవలే 894 కోట్ల రూపాయల చెక్కులను సీఎం చంద్రబాబు అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.

రేపు (నవంబర్ 2) విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దెందేరులో, గజపతినగరం మండలం పురిటిపెంటలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas)అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. గంగచోళ్ల పెంట వద్ద హెలీప్యాడ్ ను ఏర్పాటు చేశారు. పురిటిపెంటలో రూ.826 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా చేయనున్న రోడ్ల మరమ్మతు పనులను సీఎం ప్రారంభించనున్నారు. అలాగే రోడ్డుపై ఏర్పడిన గుంతల్ని పూడ్చే పనుల్లో పాల్గొననున్నారు.

Advertisement

Next Story