Murders: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య.. కరెంట్ కట్ చేసి ఇనుపరాడ్లతో..

by Rani Yarlagadda |   ( Updated:2024-11-01 03:20:37.0  )
Murders: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య.. కరెంట్ కట్ చేసి ఇనుపరాడ్లతో..
X

దిశ, వెబ్ డెస్క్: పండుగవేళ కాకినాడ జిల్లాలో (Kakinada District) దారుణ ఘటన జరిగింది. కాజులూరు మండలం శలపాకలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య కలకలం రేపింది. ఇనుపరాడ్లతో కిరాతకంగా కొట్టి చంపారు. సమాచారం అందుకున్న గొల్లపాలెం పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతులను బత్తుల రమేష్, బత్తుల చిన్ని, బత్తుల రాజుగా గుర్తించారు. కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యలకు వివాహేతర సంబంధం, పాతకక్షలే హత్యలకు ప్రధాన కారణాలని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

Next Story

Most Viewed