- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్యూటిఫుల్ లవ్‌స్టోరీతో ఆకట్టుకుంటోన్న ‘28 డిగ్రీస్ సెల్సియస్’ చిత్రం ట్రైలర్

దిశ, వెబ్‌డెస్క్: పొలిమేర (Polimera)సిరీస్ చిత్రాలతో ఫుల్ ఫేమ్ దక్కించుకున్నారు డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్(Dr. Anil Vishwanath). ఈయన ప్రస్తుతం ‘ 28 డిగ్రీస్ సెల్సియస్’ (28 degrees Celsius) సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర (Naveen Chandra) కథానయకుడిగా నటిస్తున్నారు. అలాగే వైవా హర్ష (Viva Harsha), షాలిని (Shalini), ప్రియదర్శి (Priyadarshi) పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 4 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వబోతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మూవీ టీమ్ ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసి జనాల్లో మరింత హైప్ పెంచుతున్నారు. తాజాగా (మార్చి 24) 28 డిగ్రీస్ సెల్సియస్ ట్రైలర్ రిలీజ్ అవ్వగా.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఓ హౌస్ వల్ల హీరో లైఫ్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలేంటన్న ఇంట్రెస్టింగ్ అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోందని ప్రస్తుతం ఈ చిత్ర ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరీ 28 డిగ్రీస్ సెల్సియస్ ట్రైలర్ ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి.