చారిత్రాత్మక విజయానికి అడుగు దూరంలో ఆంధ్ర జట్టు

by Harish |
చారిత్రాత్మక విజయానికి అడుగు దూరంలో ఆంధ్ర జట్టు
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్‌లో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు విజయం దిశగా వెళ్తున్నది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే ఆలౌటై వెనుకబడిన ఆ జట్టు ఆదివారం ప్రత్యర్థిని రెండో ఇన్నింగ్స్‌లో కట్టడి చేసి పుంజుకుంది. మూడో రోజు ఆంధ్ర బౌలర్లు సమిష్టిగా రాణించి మధ్యప్రదేశ్‌ను నిలువరించారు. ఓవర్‌నైట్ స్కోరు 21/0తో ఆట కొనసాగించిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆలౌటైంది. హిమాన్షు(43) టాప్ స్కోరర్. ఆంధ్ర బౌలర్లలో నితిశ్ రెడ్డి 4 వికెట్లు, శశికాంత్, మోహన్ చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగుల ఆధిక్యం కలుపుకుని మధ్యప్రదేశ్.. ఆంధ్ర జట్టు ముందు 169 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనకు దిగిన ఆంధ్ర జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లను కోల్పోయి 95 పరుగులు చేసింది. రేవంత్(9), ప్రశాంత్(6), నితీశ్(20), కెప్టెన్ రిక్కీ భుయ్(9) నిరాశపరిచారు. అయితే, హనుమ విహారి(43 బ్యాటింగ్) క్రీజులో పాతుకపోయి జట్టును విజయం దిశగా నడిపిస్తున్నాడు. అతనితోపాటు కిర్దంత్ కరణ్(5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఆంధ్ర జట్టు విజయతీరాలకు చేరాంటే ఇంకా 75 పరుగులు చేయాల్సి ఉంది. గెలిస్తే ఆంధ్ర జట్టు టోర్నీలో చరిత్రలో తొలిసారిగా సెమీస్‌లోకి అడుగుపెట్టనుంది.

Advertisement

Next Story

Most Viewed