- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
శతకాలతో రెచ్చిపోయిన హైదరాబాద్ బ్యాటర్లు నితేశ్, ప్రగ్నయ్
దిశ, స్పోర్ట్స్ : హైదరాబాద్, మేఘాలయ జట్ల మధ్య రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూపు ఫైనల్ ఆసక్తికరంగా మారుతోంది. తొలి రోజు మేఘాలయ 304 పరుగులు చేసి ఆలౌటవ్వగా.. రెండో రోజు హైదరాబాద్ బ్యాటుతో ధీటుగా బదులిచ్చింది. ఓవర్‌నైట్ స్కోరు 25/2తో ఆదివారం ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లలో కెప్టెన్ తిలక్ వర్మ(44) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. రాహుల్ సింగ్(15), చందన్ సహాని(11) నిరాశపరిచారు. 116 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును నితేశ్ రెడ్డి(122), ప్రగ్నాయ్ రెడ్డి (102 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరూ సెంచరీలతో కదం తొక్కారు. 7 వికెట్‌కు ఈ జోడీ 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌లో జట్టును పోటీలోకి తెచ్చారు. నితేశ్ అవుటైన తర్వాత ప్రగ్నాయ్ జట్టును నడిపించినా.. మరో ఎండ్‌లో వికెట్లు నిలువలేదు. చివరి వికెట్‌గా రిషబ్ బాస్లాస్(0) అవుటవడంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. మేఘాలయ బౌలర్లలో చెంగ్కం సంగ్మా, ఆకాశ్, డిప్పు సంగ్మా మూడేసి వికెట్లతో సత్తాచాటారు. ఆఖర్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మేఘాలయ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ రామ్ గురుంగ్(0)ను త్యాగరాజన్ అవుట్ చేశాడు. దీంతో మేఘాలయ ఖాతా తెరవకముందే తొలి వికెట్ కోల్పోయింది. అదే సమయంలో అంపైర్లు రెండో రోజు ఆట ముగిసినట్టు ప్రకటించారు. దీంతో ఆట ముగిసే సమయానికి మేఘాలయ 0/1తో నిలువగా.. రాజ్ బిస్వా(0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.