- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సత్తాచాటిన రోహిత్, రాహుల్.. తొలి రోజు హైదరాబాద్‌దే
దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో ప్లేట్ విభాగంలో హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న ఆ జట్టు..వరుసగా ఐదో విజయంపై కన్నేసింది. శుక్రవారం మిజోరంతో ప్రారంభమైన చివరి గ్రూపు మ్యాచ్‌లో తొలి రోజు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మిజోరం తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకే ఆలౌటైంది. కరియప్ప(45), అగ్ని చోప్రా(43) పర్వాలేదనిపించగా.. మిగతా వారు తేలిపోయారు. రోహిత్ రాయుడు 4 వికెట్లతో మిజోరం పతనాన్ని శాసించాడు. మొదటి రోజే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(6) నిరాశపరిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రాహుల్ సింగ్(81 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతనితోపాటు రోహిత్ రాయుడు(25 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ ఇంకా 79 పరుగులు వెనకబడి ఉన్నది.