- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూపు విజేత హైదరాబాద్.. ఫైనల్‌లో మేఘాలయపై విజయం
దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూపు విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. ఫైనల్‌లో మేఘాలయను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మేఘాలయపై 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపొందింది. మేఘాలయ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సునాయాసంగా ఛేదించింది. 34.2 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 203 పరుగులు చేసింది.ఓవర్‌నైట్ స్కోరు 71/1తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన హైదరాబాద్‌ను బౌలర్ చెంగ్కం సగ్మా దెబ్బ కొట్టాడు. వరుస ఓవర్లలో ఓవర్‌నైట్ బ్యాటర్లు తనయ్ త్యాగరాజన్(26), రాహుల్ సింగ్(62) వికెట్లు పారేసుకున్నారు. దీంతో హైదరాబాద్ కాస్త తడబడినట్టు కనిపించినా కెప్టెన్ తిలక్ వర్మ(64) నిలబడ్డాడు. హాఫ్ సెంచరీతో మెరిసిన తిలక్.. రోహిత్ రాయుడు(34)తో కలిసి నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువ చేశారు. మరో 7 పరుగుల చేస్తే గెలుపు దక్కే సమయంలో తిలక్ వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే రోహిత్ కూడా వెనుదిరిగాడు. అయితే, చందన్ సహాని(8 నాటౌట్), నితేశ్ రెడ్డి(3 నాటౌట్) మిగతా పని పూర్తి చేయడంతో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది.
ఫైనల్‌లో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన హైదరాబాద్ ఆటలో మరో రోజు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.టోర్నీలో హైదరాబాద్ ఒక్క మ్యాచ్ కూడా ఓడకపోవడం విశేషం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు విజేతకు ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జట్టుకు రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్ ప్రకటించారు. అలాగే, ఫైనల్‌లో సత్తాచాటిన నితేశ్ రెడ్డి, స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్, కెప్టెన్ తిలక్ వర్మ, ప్రజ్ఞయ్ రెడ్డిలకు రూ. 50 వేల నగదు బహమతి అందజేశారు. కాగా, వచ్చే రంజీ ట్రోఫీ సీజన్‌లో హైదరాబాద్, మేఘాలయ జట్లు ఎలైట్ గ్రూపులో పాల్గొంటాయి.