Rahul Dravid : భారత హెడ్ కోచ్‌గా ముగిసిన రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్

by Mahesh |   ( Updated:2023-11-20 07:44:06.0  )
Rahul Dravid : భారత హెడ్ కోచ్‌గా ముగిసిన రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ ఎనలేని కీర్తిని దక్కించుకున్నాడు.ఈ వరల్డ్ కప్ సీజన్ లో ఆయన భారత జట్టుతో అహర్నిషలు పాల్గోని గెలుపు వైపు నడించాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాగా నిన్నటితో ద్రవిడ్ ప్రధాన కోచ్‌ కాంట్రాక్ట్ అధికారికంగా ముగిసింది. కాగా తదుపరి కోచ్ ఎవరనే దానిపై భవిష్యత్తు కార్యాచరణ గురించి బీసీసీఐలో ఇంకా చర్చించనట్లు తెలుస్తోంది. అయితే ద్రవిడ్ ను ప్రధాన కోచ్ గా కొనసాగిస్తారా.. లేకా గతంలో లాగా అండర్ 19, అండర్ 17 జట్లకు కోచ్ గా పంపుతారా అనే విషయంపై క్లారిటి రావాల్సి ఉంది. ఒకవేళ ద్రవిడ్‌ను మారిస్తే అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనే చర్చలు జోరందుకున్నాయి.

Advertisement

Next Story