సింధుకు మళ్లీ షాక్.. ఇండోనేషియా ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఔట్

by Harish |
సింధుకు మళ్లీ షాక్.. ఇండోనేషియా ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత నెల చివర్లో సింగపూర్ ఓపెన్ రెండో రౌండ్‌లో ఓడిన ఆమె.. తాజాగా ఇండోనేషియా ఓపెన్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది. జకార్తాలో బుధవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో వరల్డ్ నం.12 సింధు 15-21, 21-15, 14-21 తేడాతో తన కంటే తక్కువ ర్యాంక్ కలిగిన వరల్డ్ నం.26 వెన్ చి హ్సు(చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. తొలి గేమ్ కోల్పోయిన తర్వాత పుంజుకున్న సింధు రెండో గేమ్‌ను దక్కించుకుని పోటీలోకి వచ్చింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఆరంభంలోనూ అదే జోరు కొనసాగించిన ఆమె ఒక దశలో 9-6తో ఆధిక్యంలో నిలిచింది. అదే దూకుడు కొనసాగితే సింధు గెలుపు ఖాయమే అనుకుంటున్న తరుణంలో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.

మరోవైపు, ఉమెన్స్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జంట శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో అశ్విని జోడీ 21-15, 21-15 తేడాతో కెనడాకు చెందిన జాకీ డెంట్-క్రిస్టల్ లాల్ ద్వయంపై గెలుపొందింది. మరో భారత జంట రుతుపర్ణ పాండా-శ్వేతపర్ణ పాండా 12-21, 9-21 తేడాతో 6వ సీడ్ కిమ్ సో యోంగ్-కాంగ్ హీ యాంగ్(సౌత్ కొరియా) జోడీ చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది.

Advertisement

Next Story

Most Viewed