SBI: అరుదైన ఘనత సాధించిన ఎస్‌బీఐ.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంకుగా అవార్డ్

by Maddikunta Saikiran |
SBI: అరుదైన ఘనత సాధించిన ఎస్‌బీఐ.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంకుగా అవార్డ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు(Public Sector Bank)ల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అరుదైన రికార్డు నెలకొల్పింది. దేశంలో ఎక్కువమంది కస్టమర్లకు(Customers)కు సర్వీసులు అందించిన బ్యాంకుల్లో అత్యుత్తమ బ్యాంక్(Best Bank)గా చరిత్ర సృష్టించింది. అగ్రరాజ్యం అమెరికా(America)కు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజిన్(Global Finance Magazine) ఎస్‌బీఐను ఉత్తమమైన బ్యాంక్గా సెలెక్ట్ చేసింది. కాగా వాషింగ్టన్(Washington)లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్(IMF), ప్రపంచ బ్యాంక్(World Bank) సంయుక్తంగా కలిసి 31వ వార్షిక బెస్ట్ బ్యాంక్ అవార్డుల(31st Annual Best Bank Awards)ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ అవార్డును ఎస్‌బీఐకు ప్రదానం చేశారు. ఈ అవార్డును ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు(SBI Chairman Challa Srinivasulu) అందుకున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. కస్టమర్లకు మిగతా ఏ బ్యాంకులు అందించని విధంగా సేవలు అందించి వారి నమ్మకాన్ని గెలుచుకోవడంలో తమ బ్యాంక్ ఎప్పుడు మొదటి ప్లేస్(First place)లో ఉంటుందని ఎస్‌బీఐ పేర్కొంది.

Advertisement

Next Story