- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తప్పుగా కొన్నాము.. ఆ ప్లేయర్ మాకొద్దన్నారు.. తీరా కట్ చేస్తే 5.5 కోట్లకు రిటైన్ చేసుకున్న జట్టు
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్(IPL) 2024 సీజన్ కు సంబంధించిన మినీ వేలం 2023 డిసెంబర్ నెలలో జరిగింది. ఈ మినీ వేలంలో పంజాబ్(Punjab) జట్టు శశాంక్ సింగ్( Shashank Singh) అనే యువ ప్లేయర్ ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. అనంతరం తాము కావాలనుకుంది.. ఈ శశాంక్ ను కదాని.. మరో ప్లేయర్ ను కొనాలనుకొన్నామని.. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండటంతో ఇతన్ని కొనుగోలు చేశామని.. పంజాబ్ యాజమాన్యం(Punjab team) వేలం అధికారులకు చెప్పుకొచ్చింది. తమకు ఈ ప్లేయర్ వద్దని వెనక్కి తీసుకోవాలని కూడా కోరింది. అయితే ఐపీఎల్ అధికారులు మాత్రం దానికి ఒప్పుకోలేదు. తీరా చూస్తూ 2024 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ జట్టు వద్దనుకున్న ఈ యువ ప్లేయర్ పెను సంచలనంగా మారాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచులను గెలిపించి ఆ జట్టులో స్టార్ ఫినిషర్ గా గుర్తింపు పొందాదు.
తీరా సీన్ కట్ చేస్తూ.. 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు.. ఐపీఎల్ జట్లు తాము రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్ట్ అక్టోబర్ 31 విడుదల చేశారు. ఇందులో పంజాబ్ జట్టు ఎవరూ ఊహించని విధంగా కేవలం ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అందులో.. గత సీజన్ లో వద్దనుకున్న యువ ప్లేయర్ శశాంక్ సింగ్ కు ఏకంగా 5.5 కోట్లు ఇవ్వడానికి సిద్ధం అయింది. అలాగే మరో యువ ప్లేయర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా అన్ క్యాప్డ్ జాబితాలోనే ఉన్నారు. దీంతో మెగా ఐపీఎల్ వేలం లో పాల్గొనే పంజాబ్ చేతిలో అత్యధికంగా 112 కోట్లు ఉన్నాయి.