- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన భారత యువ షట్లర్..
న్యూఢిల్లీ: భారత యువ సంచలనం ప్రియన్షు రజావత్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌తో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇటీవల ఓర్లీన్స్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకున్న ఈ యువ షట్లర్.. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ రిలీజ్ చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారీగా పాయింట్స్‌ను మెరుగుపర్చుకున్నాడు. దాంతో ఏకంగా 20 స్థానాలను ఎగబాకి 30, 786 పాయింట్స్‌తో కెరీర్ బెస్ట్ 38వ ర్యాంక్‌లో నిలిచాడు. అలాగే, భారత్ తరఫున మెరుగైన ర్యాంక్‌ను కలిగి ఉన్న హెచ్ఎస్ ప్రణయ్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఒక స్థానం మెరుగుపర్చుకుని 24వ ర్యాంక్‌కు చేరుకోగా.. తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ రెండు స్థానాలను కోల్పోయి 23వ ర్యాంక్‌కు పడిపోయాడు.
మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్నది. సైనా నెహ్వాల్ 31వ స్థానంలో ఉన్నది. భారత పురుషుల స్టార్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి 6వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. అర్జున్-ధ్రువ్ కపిల జంట 27వ ర్యాంక్‌లో ఉన్నది. ఉమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ జోడీ ఒక స్థానాన్ని కోల్పోయి 20వ ర్యాంక్‌లో నిలువగా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీషా-ఇషాన్ ద్వయం 29వ ర్యాంక్‌లో ఉంది.