- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్ష్యసేన్‌కు షాకిచ్చిన ప్రియాన్ష్
దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజ్ ఇండియా ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, వరల్డ్ నం.19 లక్ష్యసేన్‌కు యువ ఆటగాడు ప్రియాన్ష్ రజావత్ షాకిచ్చాడు. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్యసేన్‌పై పైచేయి సాధించాడు. ఢిల్లీలో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం నిర్వహించిన తొలి రౌండ్‌లో లక్ష్యసేన్‌ను 21-16, 16-21, 13-21 తేడాతో ప్రియాన్ష్ ఓడించాడు. తొలి గేమ్ కోల్పోయిన ప్రియాన్ష్ ఆ తర్వాత పుంజుకుని మిగతా రెండు గేమ్‌లను నెగ్గి మ్యాచ్‌ను దక్కించుకుని రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. స్టార్ ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో 21-6, 21-19 తేడాతో చైనీస్ తైపీ క్రీడాకారుడు చౌ టియెన్ చెన్‌పై సునాయాసంగా గెలిచాడు. గురువారం రెండో రౌండ్‌లో ప్రియాన్ష్‌తో ప్రణయ్ తలపడనున్నాడు. డబుల్స్‌లో భారత షట్లర్లకు నిరాశే ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో అర్జున్-ధ్రువ్ కపిల, ఉమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ జోడీలు తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాయి.