- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Prithvi Shaw: స్టార్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షాకు ఊహించని షాక్... రంజీ జట్టు నుంచి తొలగింపు
దిశ, వెబ్‌డెస్క్: భారత్ స్టార్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషాకు (Prithvi Shaw) ఊహించని షాక్ తగిలింది. తాజాగా, ముంబై రంజీ జట్టు (Mumbai Ranji Team) నుంచి అతడిని తొలగిస్తూ జట్టు మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, జట్టు నుంచి తప్పించేందుకు సరైన కారణాలు బయటకు రానప్పటికీ.. ఫిట్‌నెస్, క్రమశిక్షణ లేకపోవడం అందుకు ప్రధాన కారణాలని వార్తలు మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మేరకు సంజయ్ పాటిల్ (Sajay Patil) (ఎంసీఏ చైర్మన్), మరో నలుగురితో కూడిన సెలక్షన్ కమిటీ రంజీ ట్రోఫీ నుంచి పృథ్వీ షాను తప్పించినట్లుగా తెలుస్తోంది. నిత్యం ఏదో ఒక వివాదంతో మీడియాకు ఎక్కడం పృథ్వీ షాకు అలవాటై పోయిందని, కఠినమైన పనిష్మెంట్ ఇస్తేనే అతడు సరైన దారిలోకి వచ్చే అవకాశం ఉందని ముంబై రంజీ జట్టు (Mumbai Ranji Team) మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
అసలు ఎలాంటి ఫిట్‌నెస్ లెవల్స్ మెయిన్‌టెయిన్ చేయకుండా.. అధిక బరువుతో పృథ్వీ షా (Prithvi Shah) చాలా లేజీగా తయారయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా నిత్యం నెట్ సెషన్స్‌కు ఆలస్యంగా వస్తున్నట్లుగా మేనేజ్‌మెంట్ కూడా గుర్తించింది. కేరీర్‌ను ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోని పృథ్వీ షా (Prithvi Shaw)ను తమ పరిగణలోకి తీసుకోవడం కష్టమని టీమ్ మేనేజ్‌మెంట్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తోంది.
షాను రంజీ జట్టు నుంచి తొలగించాలనే నిర్ణయం జట్టు మేనేజ్‌మెంట్‌దే కాదని.. కెప్టెన్, కోచ్‌ల సూచన మేరకే అతడిపై వేటు పడినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, 2018లో రాజ్‌కోట్ (Rajkote)లో వెస్టిండీస్ (West Indies)తో జరిగిన టెస్టులో భారత్ తరఫున పృథ్వీ షా (Prithvi Shah) అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుత శతకం సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఫిట్‌నెస్, వ్యక్తిగత గొడవల కారణంగా క్రమంగా అతడు జాతీయ జట్టు (National Team)కు దూరం అయ్యాడు.