- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆఖరి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ జోరు
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో తమిళ్ తలైవాస్ చివరి మ్యాచ్‌లో విజృంభించింది. ఆ జట్టు ఇప్పటికే ఎలిమినేట్ అవ్వగా.. బెంగాల్ వారియర్స్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో చెలరేగింది. ఆదివారం హర్యానాలోని పంచుకులలో జరిగిన ఈ పోరులో బెంగాల్ వారియర్స్‌పై 37-74 తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి తమిళ్ తలైవాస్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఫస్టాఫ్‌లో 31-18తో ఆధిక్యం సాధించిన ఆ జట్టు సెకండాఫ్‌లో మరింత రెచ్చిపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు వరుస పాయింట్లతో చెలరేగడంతోపాటు పలుమార్లు బెంగాల్‌ను ఆలౌట్ చేశారు. మరోవైపు, తమిళ్ తలైవాస్ దూకుడును అడ్డుకోవడంలో బెంగాల్ వారియర్స్ విఫలమైంది. విశాల్ 19 పాయింట్లు, నరేందర్ 17 పాయింట్లతో తమిళ్ తలైవాస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ కే.సీ 46-38 తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. ఢిల్లీ తరపున ఆషు మాలిక్ 17 పాయింట్లతో చెలరేగాడు. ఢిల్లీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. బెంగాల్ వారియర్స్ 7వ స్థానంతో టోర్నీని ముగించగా..తమిళ్ తలైవాస్ 8వ స్థానంతో సరిపెట్టింది.