- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ వేదికగా పీకేఎల్-10 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు.. ఫైనల్ ఎప్పుడంటే?
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ స్టేజ్ ముగింపు దశకు వచ్చింది. తొలి రౌండ్ మొత్తం 12 దశల్లో వివిధ వేదికల్లో ప్లాన్ చేయగా.. ఇప్పటికే 9 దశల్లో మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ నెల 21న హర్యానా స్టీలర్స్, బెంగళూరు బుల్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో తొలి రౌండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో పీకేఎల్ నిర్వాహకులు గురువారం ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. ఈ నెల 26 నుంచి మార్చి 1 వరకు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఈ మ్యాచ్‌లకు హైదరాబాద్ వేదిక కానుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 26న ఎలిమినేటర్స్, 28న సెమీ ఫైనల్స్ జరగనుండగా.. మార్చి 1న ఫైనల్ జరగనుంది.
ఇటీవల హైదరాబాద్ వేదికగా గ్రూపు మ్యాచ్‌లు జరిగిన విషయం తెలిసిందే. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా 11 మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పుడు ప్లే ఆఫ్స్ మ్యా్చ్‌లకు కూడా హైదరాబాద్ ఆతిథ్యమివ్వబోతున్నది. ఇది హైదరాబాద్‌లోని కబడ్డీ అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. యూపీ యోధాస్‌పై 49-32 తేడాతో నెగ్గి లీగ్‌లో రెండో విజయం నమోదు చేసింది.
తెలుగు టైటాన్స్ అభిమానులకు మళ్లీ నిరాశ తప్పలేదు. 10వ సీజన్‌లోనైనా పుంజుకుంటుందని ఆశించగా.. ఆ జట్టు పేలవ ప్రదర్శననే మూటగట్టుకున్నది. ఇప్పటికే టైటాన్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. లీగ్‌లో ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు టైటాన్స్ 17 మ్యాచ్‌లు ఆడగా.. రెండింట మాత్రమే నెగ్గింది. 15 మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉన్నది. తొలి రౌండ్‌లో మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. అవి నామమాత్రమే. ఈ నెల 3న దబాంగ్ ఢిల్లీ కే.సీతో తలపడనుంది.
- Tags
- #PKL 10