- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pat Cummins : ఐపీఎల్ కొత్త రూల్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాట్ కమ్మిన్స్
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్, ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. అతను గత ఐపీఎల్ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లడంతో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనికి ఈ సీజన్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ డిసెంబర్ లో జరిగే వేలంలో అతను పాల్గొంటే భారీ ధరను పలికే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయన ఐపీఎస్ కప్ ను తక్కువ చేసి మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇటీవల బీసీసీఐ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. వేలంలో అమ్ముడైన ప్లేయర్లు ఎవరైనా మ్యాచులు ఆడకుండా సీజన్ కు దూరం అయితే అలాంటి వారిపై రెండేళ్ల నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. కాగా నిబంధనపై పాట్ కమ్మిన్స్ స్పందిస్తూ.. నేనెప్పుడూ అలా తప్పుకోలేదు. కానీ నా ప్రాధాన్యం మాత్రం దేశానికి టెస్టులు, ఐసీసీ ట్రోఫీలు ఆడటమే అని తేల్చి చెప్పారు. షెడ్యూల్‌ను బట్టి ఐపీఎల్ టోర్నీలో ఆడాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటాని.. పాట్ కమ్మిన్స్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలతో పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ ను తక్కువ చేయడమే అని తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా.. ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు మాత్రం కమ్మిన్స్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తున్నారు.