Paris Olympics : ఒలింపిక్స్‌లో నిరాశపర్చిన తెలుగమ్మాయి జ్యోతి.. సెమీస్‌కు చేరుకోవడంలో విఫలం

by Harish |
Paris Olympics : ఒలింపిక్స్‌లో నిరాశపర్చిన తెలుగమ్మాయి జ్యోతి.. సెమీస్‌కు చేరుకోవడంలో విఫలం
X

దిశ, స్పోర్ట్స్ : కొంతకాలంగా సంచలనాలు సృష్టిస్తున్న తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి పారిస్ ఒలింపిక్స్‌లో అంచనాలను అందుకోలేకపోయింది. 100 మీటర్ల హార్డిల్స్‌లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన ఆమె పారిస్‌లో నిరాశపర్చింది. సెమీస్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. బుధవారం జరిగిన 100 మీటర్ల హార్డిల్స్ తొలి రౌండ్‌లో ఆమె హీట్-4లో 7వ స్థానంలో నిలిచి నేరుగా సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది. అయితే, రీపేజ్ రౌండ్‌లో కూడా ఆమె ద్వారా సెమీస్‌కు చేరుకునే చాన్స్‌ను జ్యోతి సద్వినియోగం చేసుకోలేకపోయింది. గురువారం జరిగిన రీపేజ్‌ రౌండ్‌లో జ్యోతి 13.17 సెకన్లలో రేసును ముగించి 4వ స్థానంలో నిలిచింది. అయితే, టాప్-2 అథ్లెట్లు మాత్రమే సెమీస్‌కు చేరుకునే వీలు ఉండటంతో ఆమెకు నిరాశ తప్పలేదు.

Advertisement

Next Story

Most Viewed