Paris Olympics : ఒలింపిక్‌ విలేజ్‌లో వసతులపై ఇటలీ స్విమ్మర్‌ విన్నూత నిరసన

by Maddikunta Saikiran |
Paris Olympics : ఒలింపిక్‌ విలేజ్‌లో వసతులపై ఇటలీ స్విమ్మర్‌ విన్నూత నిరసన
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ ఏడాది ఒలింపిక్స్ క్రీడలకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిర్వాహకులు స్టేడియాల పునరుద్ధరణ, పారిస్ నగర సుందరీకరణపై పెట్టిన దృష్టి ప్లేయర్లు ఉండే ఒలింపిక్ విలేజ్‌పై మాత్రం పెట్టలేదు. ఒలింపిక్ విలేజ్‌లో వసతుల కొరత అథ్లెట్లను తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం పారిస్ లో ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఒలింపిక్ గ్రామంలో ఏసీలు లేక ప్లేయర్లు ఉక్కపోతకు గురవుతున్నారు. దీంతో ప్లేయర్లకు సరిగా నిద్ర ఉండకపోవడంతో తమ పోటీలలో రాణించలేకపోతున్నారు.

తాజాగా .. ఇటాలియన్ స్విమ్మర్ థామస్‌ సెకాన్, ఒలింపిక్ విలేజ్‌లో ఉక్కపోతకు తట్టుకోలేక బయట పార్క్‌లో నేల మీద టవల్ వేసుకొని పడుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయితున్నాయి . ఈ సందర్బంగా అతను మాట్లాడూతూ.. 'అక్కడ చాలా వేడిగా ఉంది. ఒలింపిక్‌ విలేజ్‌లో ఏసీ లేదు. క్రీడాకారులకు ఇచ్చే ఆహారం కూడా దారుణంగా ఉంది. అందుకే చాలామంది అథ్లెట్లు వేరే చోటకు వెళ్లి ఉంటున్నారు. ఇది చూసీ చూడకుండా వదిలేయాల్సిన విషయం కాదు. ఈ విషయం అందరికి తెలియాలని,ఇక్కడ మధ్యాహ్నం కాసేపు నిద్ర పోదామంటే వేడి, ఉక్కపోతకు తోడు అనవసర శబ్ధాలతో నిద్ర పట్టడంలేదని' తెలిపారు.నాకు మధ్యాహ్నం సరిగా నిద్ర లేకపోవడం వల్లే ఫ్రీస్టయిల్‌ ఫైనల్‌ చేరలేకపోయాను’ అని తెలిపాడు. అమెరికా టెన్నిస్‌ ప్లేయర్‌ కోకో గాఫ్‌తో పాటు మరికొంతమంది ఒలింపిక్‌ విలేజ్‌లో వసతుల కొరతపై బహిరంగంగానే ఫిర్యాదు చేసినా నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాగా.. మన అథ్లెట్ల కోసం భారత క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా 40 పోర్టబుల్‌ ఏసీలను పారిస్ కు పంపిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed