PAK vs SL: ఆదుకున్న రిజ్వాన్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం

by Vinod kumar |
PAK vs SL: ఆదుకున్న రిజ్వాన్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (73 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 86 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో రాణించాడు. పాకిస్థాన్ నిర్ణీత 42 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. రిజ్వాన్‌కు తోడుగా ఇఫ్తికర్ అహ్మద్(40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) రాణించాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టును ఆదుకున్నారు. శ్రీలంక బౌలర్లలో మతీష పతీరణ(3/65) మూడు వికెట్లు తీయగా.. ప్రమోద్ మధుషాన్(2/58) రెండు వికెట్లు పడగొట్టాడు. మహీశ్ తీక్షణ, దునీత్ వెల్లలాగే(1/40) ఓ వికెట్ దక్కింది.

Advertisement

Next Story