ఏడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు

by Naveena |
ఏడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు
X

దిశ, మహబూబ్ నగర్: అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో..అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్యను అందించే లక్ష్యంతో మొదటి విడతలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు 7 పాఠశాలలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు జిల్లాగా మెుత్తం మంజూరు చేసిన ప్రభుత్వం జడ్చర్ల,దేవరకద్ర,కొల్లాపూర్,అచ్చంపేట,నాగర్ కర్నూల్,కొడంగల్,షాద్ నగర్ నియోజకవర్గాలకు ఈ పాఠశాలలను కేటాయించారు. ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానున్న ఈ పాఠశాలల కు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొట్టమొదటగా జడ్చర్ల నియోజకవర్గంలోని బాలనగర్ మండలం పెద్దాయపల్లి గ్రామం, దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల పరిధిలోని దమగ్నాపూర్ గ్రామంలో శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి,అనిరుద్ రెడ్డి సన్నద్ధం అయ్యారు. అలాగే నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని తూడుకుర్తి గ్రామంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యాహ్నం ఒంటిగంటకు పెద్దాయపల్లి గ్రామంలోనూ, మూడు గంటలకు దమజ్ఞాపూర్ లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.ఈ మేరకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అదనపు కలెక్టర్ మోహన్ రావు, ఆర్ అండ్ బి ఈ ఈ దేశ్య నాయక్ తదితరులతో మాట్లాడి ఇంటిగ్రేటెడ్ పాఠశాలల శంకుస్థాపనకు తీసుకోవాల్సిన చర్యలను గురించి సలహాలు, సూచనలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed