- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్టర్ల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని ఆందోళన
దిశ, కరీంనగర్ : కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళ్తే పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో నాగుల ఓదెలు (52) మంగళవారం చాతీనొప్పి రావడంతో కరీంనగర్ లోని ఓ హాస్పిటల్ లో రాత్రి అడ్మి అయ్యాడు. ఉదయం డాక్టర్ స్కానింగ్ రిపోర్టులు పరిశీలించగా గుండె వాల్స్ బ్లాక్ అయ్యాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ లో ఆపరేషన్ ఉచితం అని సలహా ఇవ్వడంతో మృతుడి బంధువులు అంగీకరించారు. దీనికి సంబంధించిన ఆపరేషన్ ప్రారంభించారు.
ఆపరేషన్ చేస్తుండగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతిపై డాక్టర్లను వివరణ అడగగా మరో వాల్ బ్లాకై ఆపరేషన్ సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడని నిర్లక్ష్యంతో సమాధానం చెప్పారని బాధితులు పేర్కొన్నారు. తాము అంబులెన్స్ తీసుకొచ్చేలోగానే హాస్పిటల్ యాజమాన్యం వేరే అంబులెన్స్ లో మృతదేహాన్ని బయటికి పంపించారని తెలిపారు. దాంతో బాధితులు అడ్డుకొని స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Tags
- person died