అగ్నివీర్ ఆర్మీ, నేవీకి ఉచిత శిక్షణ

by Kalyani |
అగ్నివీర్ ఆర్మీ, నేవీకి ఉచిత శిక్షణ
X

దిశ, గజ్వేల్ రూరల్ : గజ్వేల్ పట్టణంలోని ఆజాద్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అగ్నివీర్ ఆర్మీ, నేవీకి ఉచిత శిక్షణను అందించడం జరుగుతుందని ఆజాద్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ నీల చంద్రం ( రిటైర్డ్ ఆర్మీ) ఒక ప్రకటనలో తెలిపారు. 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, టెన్త్ క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ కలిగిన నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా అప్లై చేసుకుని, ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మొత్తంలో ఇండియన్ డిఫెన్స్ రంగంలో చేరి దేశ సరిహద్దు భద్రతలో భాగం కావాలని పిలుపునిచ్చారు. దీనికి కారణం ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వేల్ ఆధ్వర్యంలో జాబ్ వచ్చేంతవరకు ఫ్రీ కోచింగ్ అందించడం జరుగుతుంది అని తెలిపారు. ఇండియన్ ఆర్మీ, నీవిధార వెలుబడిన అగ్ని వీర్ నోటిఫికేషన్ ఈనెల 10వ తేదీతో ముగుస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు 9392691069, 9948643620 నెంబర్లతో సంప్రదించాలని కోరారు.

Next Story

Most Viewed