సెలవు రోజుల్లో కూడా ఆ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు

by Sridhar Babu |
సెలవు రోజుల్లో కూడా ఆ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సెలవు రోజుల్లో కూడా ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్​ రాధికగుప్తా తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్లతో జరిగిన టెలికాన్ఫరెన్స్​లో ఆమె మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఎక్కువ మంది నిరుద్యోగులు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు.

ప్రజాపాలన కేంద్రాల వద్ద ఆన్ లైన్ లోనే కాకుండా ఆఫ్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెలవు దినాలలో కూడా ఈ కేంద్రాలు పని చేస్తాయని అన్నారు. ఆఫ్ లైన్ లో స్వీకరించిన దరఖాస్తులను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి జాగ్రత్తగా భద్రపరచాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్​ ఆదేశించారు. కొన్ని మున్సిపాలిటీలలో మైనారిటీ దరఖాస్తులు రానందున, వారిని చైతన్యం చేయాలన్నారు. 25 శాతం సింగిల్ ఉమెన్, వితంతులకు, 5 శాతం దివ్యాంగులకు ఈ పథకంలో రిజర్వేషన్​ కల్పించినందున వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.



Next Story

Most Viewed