యువకుడు దారుణ హత్య

by Sridhar Babu |   ( Updated:2024-10-10 15:11:10.0  )
యువకుడు దారుణ హత్య
X

దిశ,పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా 8 ఇంక్లైన్ కాలనీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 8 ఇంక్లైన్ కాలనీలో హనుమాన్ నగర్ లో వడ్డాది వినయ్ కుమార్ (25) అనే యువకున్ని గురువారం దారుణంగా హత్య చేశారు. వివాహితతో ప్రేమ వ్యవహారమే వినయ్ హత్యకు దారితీసింది. వినయ్ కుమార్ గోదావరిఖని సింగరేణి ఆస్పత్రిలో స్కావేంజర్ గా పనిచేస్తున్నాడు. ఖనికి చెందిన భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న వివాహితతో కొంతకాలంగా మృతుడు ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు.

ఈ క్రమంలో సదరు వివాహితను మూడు నెలల క్రితం వినయ్ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వివాహాన్ని అంగీకరించకపోవడంతో స్థానిక హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. వివాహిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో ఇద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో గురువారం 8 ఇంక్లైన్ కాలనీకి వినయ్ కుమార్ వెళ్లాడు. పక్కా పథకం ప్రకారం సదరు వివాహిత భర్త తమ్ముడు కలిసి హత్య చేశారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ, స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed