AUS vs IND 4th Test Day 1: ముగిసిన మొదటి రోజు ఆట.. భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా

by Mahesh |
AUS vs IND 4th Test Day 1: ముగిసిన మొదటి రోజు ఆట.. భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా టెస్ట్ సిరీస్(Test series) జరుగుతోంది. ఇందులో భాగంగా నేడు నాలుగో టెస్ట్(నాలుగో టెస్ట్) ఈ రోజు తెల్లవారుజామున ప్రారంభం అయింది. మెల్బోర్న్(Melbourne) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా(Australia) జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచులో మొదటి నుంచి ఆస్ట్రేలియా బ్యాటర్లు భారత(India) బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించారు. ముఖ్యంగా ఓపేనర్‌గా వచ్చిన యువ ప్లేయర్ కొట్సస్‌ అద్భుతమైన అర్ధసెంచరీతో తన మొదటి మ్యాచులోనే రెచ్చిపోయాడు. అనంతరం 60 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అలాగే బ్యాటింగ్ కు వచ్చిన ఎనిమిది మంది ప్లేయర్లలో నలుగురు ఆర్ధ సెంచరీలతో రాణించిన వారిలో సామ్ కాన్స్టాన్స్ 60, ఉస్మాన్ ఖవాజా 57, మౌర్నెస్ లాబుస్చాగ్నే 72, స్టీవ్ స్మిత్ 68*, ఉండగా.. అలెక్స్ కేరీ 31 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లు ఆడి.. 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్మిత్ 68, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 8* పరుగులతో ఉన్నారు. ఈ ఆదిపత్యం ఇలానే కొనసాగితే మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచులో భారత బౌలర్లలో బుమ్రా 3, జడేజా, ఆకాష్ దీప్, సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇందులో బుమ్రా(Bumrah).. ఆస్ట్రేలియా డెంజరస్ బ్యాటర్ అయిన ట్రావిస్ హెడ్(Travis Head) ను క్లీన్ బోల్డ్ చేసి డకౌట్ గా పెవిలియన్ చేర్చాడు.

Advertisement

Next Story

Most Viewed