CM Cup-2024: సీఎం కప్-2024 రాష్ట్ర స్థాయి పోటీలకు సర్వం సిద్ధం.. ఎప్పటినుంచంటే?

by Ramesh N |
CM Cup-2024: సీఎం కప్-2024 రాష్ట్ర స్థాయి పోటీలకు సర్వం సిద్ధం.. ఎప్పటినుంచంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న (CM Cup-2024) సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతోంది. మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుంచి నిర్వహిస్తున్న ఈ పోటీలు గ్రామస్థాయి, మండల స్థాయి మరియు జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించబోతున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది.

ఇందులో పాల్గొంటున్న దాదాపు రెండు లక్షల మందికి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయడం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం, క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చడం రాబోయే తరానికి దిక్సూచిలా కృషి చేస్తున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది. వివక్షతకు తావు లేకుండా పారా క్రీడాంశాలో పోటీలు నిర్వహించుకోవడం ఈ సీఎం కప్ పోటీలో మరో ప్రత్యేకత అని తెలిపింది. అయితే, ఈ క్రీడల్లో పాల్గొని క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ సీఎం కప్ 2024 విజయవంతం చేయడంలో యావత్తు తెలంగాణ క్రీడా సంఘాలు, పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్ స్వచ్ఛంద సంస్థలు పలువురు క్రీడాభిమానులు పాల్గొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed