పాక్ ప్లేయర్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్

by Vinod kumar |   ( Updated:2023-08-24 12:09:43.0  )
పాక్ ప్లేయర్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్‌ ఆటగాడు షాదాబ్‌ ఖాన్‌ ఓ కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. నసీం షా బౌలింగ్‌లో నమ్మశక్యంకాని రీతిలో షాదాబ్‌ ఖాన్‌ గాల్లోకి ఎగిరి ఆఫ్ఘన్‌ కెప్టెన్‌ హస్మతుల్లా షాహీది (0) క్యాచ్‌ను పట్టుకున్నాడు. షాహీది పుల్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న షాదాబ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. షాదాబ్‌ పక్షిలా గాల్లోకి ఎగురూతూ ఎడమ చేత్తో అందుకున్న అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

Advertisement

Next Story