- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘యూత్ బాక్సింగ్’కు 50 మంది బాక్సర్లు.. ఎంపిక చేసిన బీఎఫ్ఐ
దిశ, స్పోర్ట్స్: కజకిస్తాన్‌లోని ఆస్తానా వేదికగా ఈ నెల 27(శనివారం) నుంచి వచ్చే నెల 7వరకు జరగనున్న ఎస్‌బీసీ ఆసియన్ అండర్-22, యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ టోర్నీల్లో పాల్గొనబోయే క్రీడాకారులను ‘భారత బాక్సింగ్ సమాఖ్య’(బీఎఫ్ఐ) ఎంపిక చేసింది. 50 మంది బాక్సర్లతో కూడిన జాబితాను బుధవారం ప్రకటించింది. మాజీ యూత్ వరల్డ్ చాంపియన్, ఆసియా ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్(2022)లో స్వర్ణ పతక విజేత అల్ఫియా పఠాన్ (81 కేజీలు)తోపాటు 2022 ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని గెలుచుకి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్రీతి(54కేజీ) అండర్-22 విభాగంలో భారత్‌కు నాయకత్వం వహించనున్నారు. వీరితోపాటు ప్రస్తుత యూత్ వరల్డ్ చాంపియన్లు దేవికా ఘోర్పడే (52 కేజీలు), విశ్వనాథ్ సురేష్(48 కేజీలు), సీనియర్ నేషనల్ చాంపియన్‌లు ప్రాచీ (63 కేజీలు), ఆకాష్ గూర్ఖా (60కేజీలు), జుగ్నూ (86 కేజీలు)లు అండర్-22 జట్టులో చోటుదక్కించున్నారు. అండర్-22, యూత్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఒక్కో దాంట్లో 25 మంది చొప్పున బాక్సర్లు పాల్గొనున్నారు. పురుషులు, మహిళల కేటగిరీల్లో వరుసగా 13, 12 విభాగాలు ఉంటాయి.