- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుంజుకున్న ఇంగ్లాండ్.. భారీ శతకంతో కదం తొక్కిన ఓలీ పోప్
దిశ, స్పోర్ట్స్ : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. మ్యాచ్‌లో తొలి రెండు రోజులు తేలిపోయిన ఇంగ్లాండ్.. మూడో రోజు పుంజుకుంది. ఓలీ పోప్ అజేయ శతకంతో రాణించడంతో ఇంగ్లిష్ జట్టు పోటీలోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులు వెనకబడిన ఆ జట్టు మూడో రోజు 126 పరుగుల ఆధిక్యం సాధించింది. మరోవైపు, బౌలర్లు కీలక వికెట్లు తీయడం భారత్‌కు కలిసిరానుంది. శనివారం మొదట ఓవర్‌నైట్ స్కోరు 421/7తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 15 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. సెంచరీ చేస్తాడని భావించిన రవీంద్ర జడేజా(87) ఓవర్‌నైట్ స్కోరుకు 6 పరుగులు మాత్రమే జోడించి శతకం చేజార్చుకున్నాడు. జోరూట్ బౌలింగ్‌లో జడేజా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంతి బ్యాట్, ప్యాడ్‌లకు ఒకే సమయంలో తగిలినట్టు కనిపించినప్పటికీ.. అంపైర్ కాల్ ప్రకారం అతను మైదానం వీడాడు. అదే ఓవర్‌లో బుమ్రా కూడా అవుటవ్వగా.. ఆ తర్వాతి ఓవర్‌లో అక్షర్(44) పెవిలియన్ చేరడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేయగా.. 190 పరుగుల ఆధిక్యం పొందింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. ఓలీ పోప్(148 బ్యాటింగ్, 208 బంతుల్లో 17 ఫోర్లు) అజేయ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతనితోపాటు రెహాన్ అహ్మద్(16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బెన్ డక్కెట్(47), బెన్ ఫోక్స్(34), జాక్ క్రాలీ(31) పర్వాలేదనిపించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 126 ఆధిక్యంలో ఉండగా చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. ఆదివారం ఇంగ్లాండ్‌ను త్వరగా ఆలౌట్ చేస్తే మ్యాచ్ భారత్ చేజారకుండా ఉంటుంది.
ఆటంతా ఓలీ పోప్‌దే
మూడో రోజు తొలి సెషన్‌లోనే రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్‌కు సరైన శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఆడుతున్న జాక్ క్రాలీ(31)ని అశ్విన్ అవుట్ చేయడంతో 45 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. మూడో రోజు ఆటంతా అతనిదే. మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పుంజుకుందంటే కారణం అతనే. మొదట మరో ఓపెనర్ బెన్ డక్కెట్(47)తో కలిసి రెండో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. డక్కెట్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయి తడబడింది. వరుస ఓవర్‌లో జోరూట్(2)ను బుమ్రా పెవిలియన్ పంపగా.. స్వల్ప వ్యవధిలోనే బెయిర్ స్టో(10), బెన్ స్టోక్(6) అవుటయ్యారు. దీంతో ఇంగ్లాండ్ 163 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ సమయంలో బెన్ ఫోక్స్(34) సహకారంతో ఓలీ పోప్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వికట్ కాపాడుకుంటూ ఆచితూచి ఆడుతున్న ఓలీ పోప్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలోనే 154 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ తర్వాత ఓలీ పోప్ దూకుడు పెంచి బౌండరీలు బాదాడు. అతన్ని అవుట్ చేసేందుకు రోహిత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే, బెన్ ఫోక్స్‌ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేసి ఈ జోడీని విడదీశాడు. 6వ వికెట్‌కు ఈ జోడీ 112 జతచేసింది. అనంతరం రెహాన్ అహ్మద్(16 బ్యాటింగ్)తో కలిసి ఓలీ పోప్ మూడో రోజు ముగించాడు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు.
స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 246 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : 436 ఆలౌట్(121 ఓవర్లు)
యశస్వి జైశ్వాల్(సి అండ్ బి) రూట్ 80, రోహిత్(సి)స్టోక్స్(బి)జాక్ లీచ్ 24, గిల్(సి)డక్కెట్(బి)టామ్ హార్ట్లీ 23, రాహుల్(సి)రెహాన్ అహ్మద్(బి)టామ్ హార్ట్లీ 86, శ్రేయస్ అయ్యర్(సి)టామ్ హార్ట్లీ(బి)రెహాన్ అహ్మద్ 35, జడేజా ఎల్బీడబ్ల్యూ(బి)రూట్ 87, శ్రీకర్ భరత్ ఎల్బీడబ్ల్యూ(బి)రూట్ 41, అశ్విన్ రనౌట్(టామ్ హార్ట్లీ/ఫోక్స్) 1, అక్షర్ పటేల్(బి)రెహాన్ అహ్మద్ 44, బుమ్రా(బి)రూట్ 0, సిరాజ్ 0 నాటౌట్ ; ఎక్స్‌ట్రాలు 15.
వికెట్ల పతనం : 80-1, 123-2, 159-3, 223-4, 288-5, 356-6, 358-7, 436-8, 436-9,436-10
బౌలింగ్ : మార్క్‌వుడ్(17-147-0), టామ్ హార్ట్లీ (25-0-131-2),జాక్ లీచ్ (26-6-63-1), రెహాన్ అహ్మద్ (24-4-105-2), రూట్ (29-5-79-4)
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 316/6(77 ఓవర్లు)
జాక్ క్రాలీ(సి)రోహిత్(బి)అశ్విన్ 31, బెన్ డక్కెట్(బి)బుమ్రా 47, ఓలీ పోప్ 148 బ్యాటింగ్, జోరూట్ ఎల్బీడబ్ల్యూ(బి)బుమ్రా 2, బెయిర్‌స్టో(బి)జడేజా 10, బెన్ స్టోక్స్(బి)అశ్విన్ 6, బెన్ ఫోక్స్(బి)అక్షర్ 34, రెహాన్ అహ్మద్ 16 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 22.
వికెట్ల పతనం : 45-1, 113-2, 117-3, 140-4, 163-5, 275-6
బౌలింగ్ : బుమ్రా(12-3-29-2), అశ్విన్ (21-3-93-2), అక్షర్ (15-2-69-1), జడేజా (26-1-101-1), సిరాజ్ (3-0-8-0)