కాంస్యం సాధించిన హాకీ ప్లేయర్లపై కనక వర్షం

by Harish |
కాంస్యం సాధించిన హాకీ ప్లేయర్లపై కనక వర్షం
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన భారత పురుషుల హాకీ జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒలింపిక్స్‌లో దేశానికి వరుసగా రెండో పతకం అందించిన భారత ఆటగాళ్లపై కనక వర్షం కురుస్తోంది. ఒడిశాకు చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్‌కు ఒడిశా ప్రభుత్వం రూ. 4 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. అలాగే, జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 15 లక్షల చొప్పున, సపోర్టింగ్ స్టాఫ్‌లోని ప్రతి ఒక్కరికి రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపింది.

మరో డిఫెండర్ వివేక్ సాగర్ ప్రసాద్‌‌కు మధ్యప్రదేశ్ సర్కారు రూ. కోటి క్యాష్ ప్రైజ్ మనీని ఇవ్వనుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శుక్రవారం వివేక్ సాగర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కాంస్యం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో కూడా వివేక్ సాగర్ ఉన్నాడు. అప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అతనికి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. అలాగే, పంజాబ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ఆటగాళ్లకు రూ. కోటి ఇవ్వనుంది. హాకీ ఇండియా జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 15 లక్షలు, సపోర్టింగ్ స్టాఫ్‌లోని ప్రతి ఒక్కరికి రూ. 7.5 లక్షల చొప్పున ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed