మళ్లీ నంబర్‌ వన్‌‌గా సెర్బియా టెన్నిస్ స్టార్..

by Vinod kumar |
మళ్లీ నంబర్‌ వన్‌‌గా సెర్బియా టెన్నిస్ స్టార్..
X

దిశ, వెబ్‌డెస్క్: 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించడం ద్వారా సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ అగ్రపీఠాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన అగ్ర స్థానాన్ని మళ్లీ అందుకున్నాడు. ఏటీపీ సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 7,595 పాయింట్లతో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు టాప్‌లో ఉండి సెమీస్‌లో జొకోవిచ్‌ చేతిలో ఓడిన అల్‌కరాజ్‌ రెండో స్థానానికి పడిపోగా, రష్యా ప్లేయర్‌ ఖచనోవ్‌ మరోసారి టాప్‌–10లోకి అడుగు పెట్టాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుడిగా జొకోవిచ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

మహిళల విభాగంలో టాప్ ర్యాంకు.. ఇగా స్వియాటెక్..

మహిళల విభాగంలో ఇగా స్వియాటెక్ టాప్ ర్యాంకును సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలవడంతో ఆమె నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అరినా సబలెంక, ఎలెనా రిబకినా, కరోలిన్‌ గార్సియా, జెస్సికా పెగ్యులా వరుసగా తరువాతి నాలుగు స్థానాలను దక్కించుకున్నారు.

Advertisement

Next Story