జకోవిచ్ గాయంతోనే ఆడి.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిల్ గెలిచాడు: టోర్నీ డైరెక్టర్

by Hajipasha |   ( Updated:2023-02-01 17:18:17.0  )
జకోవిచ్ గాయంతోనే ఆడి.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిల్ గెలిచాడు: టోర్నీ డైరెక్టర్
X

సిడ్నీ: నోవక్ జకోవిచ్ 10వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచి తన రికార్డును కొనసాగించాడు. అయితే మూడు సెంటీమీటర్ల స్నాయువు గాయంతోనే జకోవిచ్ మ్యాచ్‌లు ఆడాడని టోర్నీ డైరెక్టర్ క్రెయిగ్ టిలె చెప్పారు. అడిలైడ్‌లో జరిగిన ప్రాక్టీస్‌లో సెర్బియన్ ఆటగాడు జకోవిచ్‌కు గజ్జల్లో గాయమైంది. అయినప్పటికీ టోర్నీ అంతా ఆడి.. ఫైనల్లో స్టెఫనోస్ సిట్సిపాస్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు. దీంతో 22 గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ గెలిచిన రాఫెల్ నాదల్ రికార్డును సమం చేశాడు.

'మూడు సెంటీమీటర్ల స్నాయువు గాయంతో ఇతను బాధపడటం నేను చూశాను. ఇది నిజమా, అబద్దమా అని చాలా మందికి అనుమానం ఉండింది. కానీ నేను ఆ స్కాన్‌లను చూశాను. డాక్టర్లు అబద్దం చెప్పరుగా. ఇటువంటి గాయాలకు ఏం చేయాలో డాక్టర్లు అవన్నీ చేశారు' అని టిలె చెప్పారు. 'గాయం కారణంగా చాలా మంది టోర్నీ మధ్యలోనే తప్పుకుంటారు. కానీ ఈ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు గాయంతో పోరాడాడు. ఏం తినాలి? ఏం తాగాలి? ఏం చేయాలి? ఎలా చేయాలి వంటి విషయాలపైనే అతను ఎక్కువగా దృష్టి పెడతాడు' అని టిలె పేర్కొన్నారు.

Advertisement

Next Story