- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గ్రేటెస్ట్ క్రికెటర్ సచిన్, కోహ్లీ కాదు

- బెస్ట్ క్రికెటర్ అంటే జాక్వెస్ కలిస్
- మీడియా అతడిని పట్టించుకోలేదు
- రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ ఎవరంటే చాలా మంది కోహ్లీ, సచిన్ టెండుల్కర్ పేర్లు చెబుతారు. కానీ నా దృష్టిలో మాత్రం ఆల్ టైం గ్రేటెస్ట్ క్రికెటర్ సౌతాఫ్రికా ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. సచిన్ టెండుల్కర్, ముత్తయ్య మురళీధరన్, వీవీ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, విరాట్ కోహ్లీ వంటి గొప్ప క్రికెటర్లు ఉండొచ్చు. కానీ తాను క్రికెట్ ఆడే రోజుల్లో ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ అనేక మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా జట్టుకు ఎన్నో విజయాలను అందించాడని పాంటింగ్ అన్నాడు. మిగిలిన వారి గురించి నాకు తెలియదు కానీ.. నా వరకు అతనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ క్రికెటర్ అని చెప్పాడు. ఏ క్రికెటర్ అయినా తమ కెరీర్‌లో బ్యాటింగ్‌లోనో, బౌలింగ్‌లోనే అత్యుత్తమ గణాంకాలు కలిగి ఉంటారు. కానీ కలిస్ రికార్డులు పరిశీలిస్తే.. అతను బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో అత్యుత్తమ గణాంకాలు నెలకొల్పాడని చెప్పాడు. టెస్టుల్లో 13 వేలకు పైగా పరుగులు, 45 సెంచరీలతో పాటు 300 పైగా వికెట్లు తీసి తన ప్రత్యేకతను చాటుకున్నాడని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక కలిస్ అద్భుతమైన ఫీల్డర్. అతను స్లిప్స్‌లో ఎన్నో అసాధారణ క్యాచ్‌లు పట్టాడని గుర్తు చేశారు. అయితే కలిస్‌కు దక్కాల్సినంత ప్రచారం దక్కలేదు. మీడియా కూడా అతని గురించి ఎక్కువగా పట్టించుకోలేద. కలిస్ కూడా దీని గురించి ఎక్కువగా మాట్లాడలేదని చెప్పాడు. తనకు హైప్ రావాలని కలిస్ ఎప్పుడూ కోరుకోలేదని.. అది అతని వ్యక్తిత్వమని చెప్పుకొచ్చాడు.