ICC Player of the month : ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నొమన్ అలీ, వుమెన్స్ విభాగంలో మెలీ కెర్

by Sathputhe Rajesh |
ICC Player of the month : ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నొమన్ అలీ, వుమెన్స్ విభాగంలో మెలీ కెర్
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌(అక్టోబర్)గా పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నొమన్ అలీ ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో రాణించడంతో ఈ ఘనత సాధించాడు. మూడు మ్యాచ్‌ల్లో 13.85 సగటుతో నొమన్ అలీ 20 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాన్ట్నర్‌ను వెనక్కి నెట్టి ఈ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఈ అవార్డు అందుకున్న తొలి పాకిస్తాన్ ప్లేయర్‌గా నొమన్ అలీ నిలిచాడు. అంతకు ముందు గతేడాది అగస్టులో బాబర్ ఆజమ్ ఈ ఫీట్ సాధించాడు.

వుమెన్స్ క్రికెట్‌లో మెలీ కెర్

న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మెలీ కెర్ వుమెన్స్ విభాగంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైంది. ఇటీవల జరిగిన ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో తొలిసారి న్యూజిలాండ్ జట్టు కప్ తెలవడంతో మెలీ కీలక పాత్ర పోషించింది. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్, ఫ్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది. అనంతరం ఇండియాతో జరిగిన సిరీస్‌లోనూ ఆమె రాణించింది.

Advertisement

Next Story

Most Viewed