వన్డే ప్రపంచకప్‌ ముందు టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ ప్లేయర్

by Vinod kumar |
వన్డే ప్రపంచకప్‌ ముందు టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ ప్లేయర్
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్‌ ముందు టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. టీమ్‌లోకి భారత స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ స్టేడియంలోకి అడుగు పెట్టే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడికి వైద్యులు పలు సర్జరీలు నిర్వహించారు.

అయితే అతడు కోలుకునే క్రమంలో మరో మైనర్‌ సర్జరీ అవసరమని తొలుత వైద్యులు భావించగా.. ఇప్పుడు పంత్‌ మరింత మెర్గుగా కోలుకోవడంతో మరి ఎటువంటి సర్జరీలు అవసరములేదని వైద్యులు తెల్చిచేప్పేశారు. దీంతో భారత్‌ వేదికగా జరగనున్న ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో పంత్‌ రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక గతేడాది డిసెంబర్‌ నుంచి పంత్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌-2023తో పాటు వరల్డ్‌టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూరమయ్యాడు.

Advertisement

Next Story