ఐపీఎల్ వేదికపై అప్పుడే స్పష్టత

by Harish |
ఐపీఎల్ వేదికపై అప్పుడే స్పష్టత
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. దేశ సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఐపీఎల్ జరుగుతుండటంతో బీసీసీఐ లీగ్‌‌ను ఇండియాలోనే నిర్వహించాలా?లేదా బయట నిర్వహించాలా? అన్న సందిగ్ధంలో పడింది. తాజాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘ఐపీఎల్‌ను తరలించాలా?లేదా? అనే విషయంపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. చర్చల తర్వాతే స్పష్టత వస్తుంది.’ అని తెలిపారు. అలాగే, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేదికలపై స్పష్టతనిచ్చారు. బెంగళూరు, ఢిల్లీ వేదికలపై మ్యాచ్‌లు జరుగుతాయని వెల్లడించారు. కాగా, ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు ఉండే అవకాశం ఉండటంతో లీగ్‌ను తరలించాలని బీసీసీఐ యోచిస్తోంది.

Advertisement

Next Story