ఇండియా లేకుంటే ‘నో’ చాంపియన్స్ ట్రోఫీ.. : మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా

by Sathputhe Rajesh |
ఇండియా లేకుంటే ‘నో’ చాంపియన్స్ ట్రోఫీ.. : మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా
X

దిశ, స్పోర్ట్స్ : టీంఇండియా పాల్గొనకుంటే చాంపియన్స్ ట్రోఫీ జరగదని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ వివాదంపై ఆయన సోమవారం తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడారు. ఇది ఐసీసీ ఈవెంట్ అని.. అయితే బ్రాడ్ కాస్టర్లు ఇప్పటికే ఈవెంట్ కోసం డబ్బు చెల్లించారన్నారు. టోర్నీలో భారత్ ఆడకపోతే వచ్చే ఆదాయం భారీ స్థాయిలో తగ్గిపోతుందన్నారు. భారత్ టోర్నీలో ఆడకపోతే టోర్నీకి ఆర్థిక చిక్కులు తప్పవన్నారు. 2023 వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్ ఇండియా వస్తున్న సమయంలో పీసీబీ బోర్డు చీఫ్ మాట్లాడుతూ.. ‘శత్రువు దేశానికి వెళ్తున్నాం.’ అని వ్యాఖ్యనించినట్లు ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో పాకిస్తాన్ భారత్‌తో ఆడకూడదని డిసైడ్ అయితే ఎలా అని అన్నారని తెలిపారు. పాకిస్తాన్ భారత్‌లో పర్యటించకుంటే ఆ దేశానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని పీసీబీ చైర్మన్ గతంలో అన్నట్లు ఆకాష్ చోప్రా తెలిపారు. టోర్నీలో పాల్గొనకుంటే ఆర్థిక ఆంక్షలు ఉంటాయని.. కానీ ఇండియాకు వెళ్లే డబ్బులను ఐసీసీ ఎలా ఆపగలదని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్‌కు ఆ పరపతి లేదు. ఇండియా లేకుండా చాంపియన్స్ ట్రోఫీ లేదన్నాడు. పాకిస్తాన్ సహా ఇతర దేశాల జట్లు ఈ అంశాన్ని అర్థం చేసుకుంటాయన్నారు. ఇండియా మ్యాచ్‌లకు యూఏఈ సరైన వేదిక అని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story