Nitish Reddy: ఆల్ టైం రికార్డ్‌పై నితీష్ కుమార్ రెడ్డి గురి.. అదేంటో తెలుసా?

by Shiva |
Nitish Reddy: ఆల్ టైం రికార్డ్‌పై నితీష్ కుమార్ రెడ్డి గురి.. అదేంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఆడిలైడ్ (Adelaide) వేదికగా జరిగిన పింక్ బాల్‌ డే అండ్ నైట్ టెస్ట్‌లో టీమిండియా (Team India) 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడింది. దీంతో అతిధ్య జట్టు ఆస్ట్రేలియా (Australia) సిరీస్‌‌ను 1-1తో సమం చేసింది. అయితే, భారత్ తొలి టెస్ట్‌లో గెలిచి రెండో టెస్ట్‌లో ఓడిపోవడం అటుంచితే.. భారత జట్టులో ఆల్‌రౌండర్‌గా వచ్చిన తెలుగబ్బాయి నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అరంగేట్రంలోనే అదరగొడుతున్నాడు. రెండో టెస్ట్‌లో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లలో అతడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన నితీష్ (Nitish) ఏ మాత్రం తడబడకుండా భారీ షాట్లను అలవోకగా ఆడుతూ.. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు.

నితీశ్ (Nitish) ఆడిన తొలి రెండు టెస్ట్‌లలో వరుసగా 41, 38, 42, 42 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు ఓ అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు. నెంబర్ 7 స్థానంలో స్థానం బ్యాటింగ్‌కు వచ్చి ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచిన భారత నాలుగో బ్యాట్స్‌మెన్‌గా చందు బోర్డే (Chandu Borde), ఎంఎస్ ధోనీ (MS Dhoni), రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) సరసన నితీశ్ నిలిచాడు. అదేవిధంగా నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) మరో ఆరు సిక్సర్లు కొడితే.. ఆస్ట్రేలియా (Australia)లో టెస్టు ఫార్మాట్‌ (Test Format)లో అత్యధిక సిక్సర్లు కొట్టిన పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్‌గా వరల్డ్ రికార్ట్ నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం ఆ రికార్డ్ వెస్టిండీస్ (West Indies) బాట్స్‌మెన్లు క్రిస్ గేల్ (Chris Gayle), వివ్ రిచర్డ్స్ (Viv Richards) పేరిట ఉంది. మొత్తం 12 సిక్సర్లు బాది వారిద్దరూ రికార్డు‌ను క్రియేట్ చేశారు.

Next Story

Most Viewed