Vinesh Phogat: స్టార్​ రెజ్లర్‌కు యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ నోటీసులు..

by Vinod kumar |   ( Updated:2023-07-14 09:52:20.0  )
Vinesh Phogat: స్టార్​ రెజ్లర్‌కు యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ నోటీసులు..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు జాతీయ యాంటీ-డోపింగ్‌ ఏజెన్సీ షాక్ ఇచ్చింది. డోపింగ్ నిరోధక సంస్థ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆమె నిబంధనలు ఉల్లంఘించిందని గుర్తించినట్లు ఏజెన్సీ తెలిపింది. ఆమె రెండు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. డోపింగ్‌ నిరోధక నిబంధనలను పాటించనందుకుగానూ ఆమెకు నోటీసులు జారీ చేసింది. "మీరు (వినేశ్‌) ఇటీవల ఇచ్చిన ఫైలింగ్‌లో జూన్‌ 27న ఉదయం 10 గంటలకు హరియాణాలోని సోనిపత్‌లో టెస్టింగ్‌కు అందుబాటులో ఉంటారని ప్రకటించారు. మీరు చెప్పిన సమయానికి మేం డోపింగ్‌ కంట్రోల్‌ ఆఫీసర్లను అక్కడకు పంపాం. కానీ, ఆ రోజు చెప్పిన ప్రాంతంలో మీరు లేరు. దీంతో డీసీవో అధికారులు టెస్టింగ్ చేయలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే మీరు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇట్టే స్పష్టమవుతోంది" అని ఆ నోటీసుల్లో తెలిపింది.

ఈ మేరకు ఈ నోటీసులుపై వినేశ్‌ ఫొగాట్‌ 14 రోజుల్లోగా తన స్పందన తెలియజేయాలని ఏజెన్సీ ఆదేశించింది. ఇక రెజ్లింగ్‌ సమాఖ్య తాత్కాలిక అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రెజర్లు చేపట్టిన ఆందోళనలో వినేశ్ ఫొగాట్‌ కీలక పాత్రలో పోషించింది. ఈ సమయంలో ఈ నోటీసులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆందోళనల నేపథ్యంలో ఇటీవల పలు టోర్నమెంట్లకు ఫొగాట్‌ దూరమైంది. మరోవైపు గురువారం నుంచి మొదలైన బుడాపెస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ 2023 పోటీల్లో ఫొగాట్‌ పాల్గొననుంది.

Advertisement

Next Story

Most Viewed