Nandini Agasara: ట్రాన్స్‌జెండర్‌ ఆరోపణలను ఖండించిన నందిని అగసారా..

by Vinod kumar |
Nandini Agasara: ట్రాన్స్‌జెండర్‌ ఆరోపణలను ఖండించిన నందిని అగసారా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన తనను ట్రాన్స్‌జెండర్‌ అంటూ తన టీమ్‌ మేట్‌ స్వప్న బర్మన్‌ చేసిన సంచలన కామెంట్స్‌పై తెలంగాణ హెప్టాథ్లెట్‌ నందిని అగసారా మండిపడింది. ‘నేనేంటో నాకు తెలుసు. ఆమె దగ్గర ఏమైనా రుజువులు ఉంటే చూపించాలి. నేను కూడా దేశం కోసం సాధించిన పతకాన్ని చూపిస్తా. నేను దేశానికి మంచి పేరు తేవాలని మాత్రమే అనుకుంటున్నాను. మనం పతకం గెలిచాం. ప్రజలు దాని గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. బర్మన్‌ ఆరోపణలపై నేను అథ్లెటిక్స్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (AFI)’ కు ఫిర్యాదు చేస్తా. వాస్తవానికి పతకం గెలిచిన సందర్భాన్ని ఎంజాయ్‌ చేద్దామనుకున్నా. కానీ, నా తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో భారత్‌కు తిరిగి వెళ్తున్నా’ అని అగసారా పేర్కొన్నారు.

సోమవారం జరిగిన మహిళల హెప్లాథ్లాన్ ఫైనల్‌లో తెలంగాణకు చెందిన హెప్టాథ్లెట్‌ నందిని అగసారా 5712 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వప్న బర్మన్‌ 5708 పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో తనకు రావాల్సిన కాంస్య పతకాన్ని ఓ ట్రాన్స్‌జెండర్‌కు వదులుకోవాల్సి వచ్చిందని బర్మన్‌ సంచలన కామెంట్స్‌ చేసింది.

Advertisement

Next Story

Most Viewed