రితికా ద్రవిడ్‌ను అలా పిలిచేది.. రోహిత్ ఎమోషనల్ పోస్టు

by Harish |   ( Updated:2024-07-09 15:28:58.0  )
రితికా ద్రవిడ్‌ను అలా పిలిచేది.. రోహిత్ ఎమోషనల్ పోస్టు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ‘కోట్లాది మందిలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి ద్రవిడ్‌ను చూస్తున్నా. అతనితో పని చేయడం నా అదృష్టం. ప్రశంసలు, విజయాలు వదిలిపెట్టి మాకు కోచ్‌గా వచ్చారు. మీతో ఏదైనా చెప్పే స్వేచ్ఛ ఇచ్చారు. మీరు ఇచ్చిన బహుమతి అది. మీ నుంచి ఎంతో నేర్చుకున్నా. మీతో ప్రతి జ్ఞాపకం విలువైనదే. నా భార్య మిమ్మల్ని నా ఉద్యోగ భార్య అని పిలిచేది. అలా పిలవడం నాకూ అదృష్టంగా ఉంది. టీ20 ప్రపంచకప్‌ను ఇద్దరం కలిసి సాధించడం సంతోషంగా ఉంది. ద్రవిడ్ భాయ్‌ మిమ్మల్ని నా నమ్మకస్తుడిగా, కోచ్‌గా, మిత్రుడిగా పిలవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.’ అని రాసుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed