రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమిండియా సీనియర్ ప్లేయర్..

by Vinod kumar |   ( Updated:2023-01-30 10:58:05.0  )
రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమిండియా సీనియర్ ప్లేయర్..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా సీనియర్ బ్యాటర్ మురళీ విజయ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. తన రిటైర్ మెంట్ లేఖను ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 2008లో భారత తరఫున అరంగేట్రం చేసిన మురళీ విజయ్ 2018లో తన చివరి మ్యాచ్‌ను ఆడాడు. ఈ మధ్యకాలంలో టెస్టుల్లో మురళీ విజయం కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ఓపెనర్‌గా ఆడిన విజయ్ టెస్టుల్లో దాదాపు 4 వేల పరుగులు సాధించాడు. అందులో 12 సెంచరీలు, 15 అర్థసెంచరీలు ఉన్నాయి.

విదేశాల్లో బెస్ట్ ఓపెనర్..

మురళీ విజయ్ భారత్ తరఫున మొత్తం 61 టెస్టులు, 17 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 3,982 పరుగులు, వన్డేల్లో 339 పరుగులు సాధించాడు. విదేశాల్లో మురళీ విజయ్‌కి మంచి రికార్డు ఉంది. ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్ వేదికగా చేసిన 144 పరుగులు, ఇంగ్లండ్‌పై ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా చేసిన 145 పరుగులు విజయ్ టెస్ట్ కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచాయి.

Advertisement

Next Story

Most Viewed