- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబై జట్టులో మార్పు.. బెరెన్‌డార్ఫ్ స్థానంలో ల్యూక్ వుడ్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 సీజన్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ సిద్ధమవుతున్నది. ఈ నెల 24న గుజరాత్ టైటాన్స్‌తో ఆ జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, లీగ్ ప్రారంభానికి ముందు ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ జాసన్ బెరెన్‌డార్ఫ్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానాన్ని ఇంగ్లాండ్ పేసర్ ల్యూక్ వుడ్‌తో ముంబై జట్టు భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు సోమవారం వెల్లడించారు. ఐపీఎల్-2024 వేలంలో ల్యూక్ వుడ్ రూ. 50 లక్షల కనీస ధరతో పాల్గొన్నాడు. అయితే, అతన్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. బెరెన్‌డార్ఫ్ దూరమవడంతో ముంబై అతన్ని కనీస ధర రూ. 50 లక్షలకు జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్‌లో పాల్గొనడం ల్యూక్ వుడ్‌కు ఇదే తొలిసారి. కాగా, ఇంగ్లాండ్ తరపున ఐదు టీ20లు, రెండు వన్డేలు ఆడిన ల్యూక్ వుడ్ 8 వికెట్లు పడగొట్టాడు.