- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్ల్యూపీఎల్‌లో ముంబైకి వరుసగా రెండో విజయం
దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అమేలియా కెర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై అలవోకగా విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ముంబై ముందు 127 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ను 18.1 ఓవర్లలోనే ఛేదించిన ముంబై 5 వికెట్లను కోల్పోయి 129 పరుగులు చేసింది. అయితే, ఛేదనలో ఓపెనర్లు యాస్తికా భాటియా(7), హేలీ మాథ్యూస్(7) నిరాశపర్చడంతో ముంబైకి శుభారంభం దక్కలేదు. నాట్ స్కివర్ బ్రంట్(22) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. బంతితో సత్తాచాటిన అమేలియా కెర్ బ్యాటుతోనూ మెరిసింది. 25 బంతుల్లో 31 పరుగులు చేసింది. అమేలియా, హర్మన్‌ప్రీత్ నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించడంతో జట్టు విజయానికి చేరువైంది. అమేలియా కెర్(31), పూజ వస్త్రాకర్(1) స్వల్ప వ్యవధిలోనే అవుటైనా హర్మన్‌ప్రీత్(46 నాటౌట్) మిగతా పని పూర్తి చేసింది. 19వ ఓవర్‌లో తొలి బంతిని ఆమె సిక్స్ బాది జట్టును గెలిపించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన అమేలియా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
మెరిసిన అమేలియా, షబ్నిమ్
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్‌ను ముంబై బౌలర్లు అడ్డుకున్నారు. అమేలియా కెర్, షబ్నిమ్ ఇస్మాయిల్ బంతితో విజృంభించడంతో గుజరాత్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో ఆ జట్టు ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. తనూజ(28) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రైస్(25 నాటౌట్), కెప్టెన్ బెత్ మూనీ(24) స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో నిర్ణీత ఓవర్లలో గుజరాత్ 9 వికెట్లను కోల్పోయి 126 పరుగులు చేసింది. ముంబై బౌల్లలో అమేలియా 4 వికెట్లు, షబ్నిమ్ ఇస్మాయిల్ 3 వికెట్లతో సత్తాచాటారు.
సంక్షిప్త స్కోరుబోర్డు
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 126/9(20 ఓవర్లు)
(తనూజ 28, బ్రైస్ 25 నాటౌట్, బెత్ మూనీ 24, అమేలియా కెర్ 4/17, షబ్నిమ్ ఇస్మాయిల్ 18/3)
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 129/5(18.1 ఓవర్లు)
(హర్మన్‌ప్రీత్ కౌర్ 46, అమేలియా కెర్ 31, తనూజ 2/21)
- Tags
- #wpl2024