IND vs WI: టీమిండియా పేసర్ అరుదైన ఘనత.. రెండో భారత ప్లేయర్‌గా..

by Vinod kumar |
IND vs WI: టీమిండియా పేసర్ అరుదైన ఘనత.. రెండో భారత ప్లేయర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత పేసర్ ముఖేష్‌ కుమార్‌ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్‌లలో అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా ముఖేష్‌ కుమార్‌ రికార్డులకెక్కాడు. ముఖేష్‌ కుమార్‌.. ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20కు తుది జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ముఖేష్‌ ఇదే పర్యటనలో విండీస్‌పై టెస్టు, వన్డే డెబ్యూ చేశాడు. కాగా ఈ ఘనత సాధించిన జాబితాలో ముఖేష్‌ కంటే ముందు టీమిండియా పేసర్‌ నట్‌రాజన్‌ ఉన్నాడు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్‌లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

అంతకుముందు విండీస్‌తో సిరీస్‌ డిసైడర్‌ మూడో వన్డేలో మాత్రం ముఖేష్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. విండీస్‌ చేతిలో 4 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో హార్దిక్‌సేన చతికిలపడింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగల్గింది.

Advertisement

Next Story

Most Viewed