టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పాక్ మాజీ కోచ్.. పట్టుబట్టి తీసుకొచ్చిన గంభీర్!

by Harish |
టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పాక్ మాజీ కోచ్.. పట్టుబట్టి తీసుకొచ్చిన గంభీర్!
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ నియామకమయ్యాడు. మోర్కెల్ నియామకాన్ని బీసీసీఐ సెక్రెటరీ జై షా బుధవారం ధ్రువీకరించారు. ఓ జాతీయ మీడియాతో జై షా మాట్లాడుతూ.. సీనియర్ భారత పురుషుల జట్టుకు మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించినట్టు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి అతని పదవీకాలం ప్రారంభం కానుంది. త్వరలోనే నేషనల్ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేయనున్నాడు.

మోర్కెల్‌కు కోచ్‌గా మంచి అనుభవం ఉంది. పాక్ జట్టుగా బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. అలాగే, ఐపీఎల్‌లో రెండు సీజన్లు లక్నో సూపర్ జెయింట్స్‌కు గంభీర్‌తో కలిసి పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే మోర్కెల్ పేరును గంభీర్ సూచించినట్టు తెలుస్తోంది. భారత మాజీ క్రికెటర్లు లక్ష్మిపతి బాలాజీ, వినయ్ కుమార్ పోటీలో ఉన్నప్పటికీ గంభీర్ మోర్కెల్ నియామకానికి పట్టుబట్టినట్టు సమాచారం. గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్‌లో అసిస్టెంట్ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చాట్, ఫీల్డింగ్ కోచ్‌గా టి. దిలీప్ చేరిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో మోర్కెల్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, సౌతాఫ్రికా తరపున మోర్కెల్ 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20లు ఆడాడు. మొత్తం 544 అంతర్జాతీయ వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి.

Next Story

Most Viewed